మూవీడెస్క్: డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్. పుష్ప మొదటి భాగం సినిమా విడుదలయ్యాక చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ చిత్రం అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కెరీర్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుంది.
ఈ చిత్రం యొక్క కథ, పాటలు, ఫైట్స్ ఇలా అన్ని అంశాల పరంగా పుష్ప ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
కాగా, ఇప్పుడు పుష్ప సీక్వెల్ అయిన పుష్ప 2 రిలీజ్ డేట్ కోసం అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
అయితే, డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని తెలియడంతో, ఆ సమయం కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. బుధవారం నుండి తదుపరి షెడ్యూల్ ప్రారంభం అవనుంది. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.
ఈ షెడ్యూల్లో బన్నీ కూడా పాల్గొననున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఈ సీక్వెల్ కోసం మరింత మంచి ట్యూన్స్ ఆయన అందించినట్టు సమాచారం.
రెండో పార్టులో ఫహాద్ ఫాజిల్ పాత్ర మరింత జోరుగా కొనసాగనుంది. మరియు సునీల్, అనసూయ, రావు రమేశ్ పాత్రలు కూడా తమ ప్రత్యేకతను నిలుపుకుంటాయని తెలుస్తోంది.