మైసూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ క్రికెట్ ప్రపంచంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు.
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నమెంట్‌లో మైసూర్ వారియర్స్ జట్టు సమిత్‌ను రూ. 50 వేలకు దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించే సామర్థ్యం ఉన్న సమిత్‌ను జట్టు యాజమాన్యం ప్రశంచింది.
అండర్-19 క్రికెట్‌లో రాణించిన సమిత్‌కు ఈ అవకాశం దక్కడం సహజమే. కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సమిత్, తన ప్రతిభను ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో కనబరచేందుకు సిద్ధమయ్యాడు.
గత సీజన్ ఛాంపియన్ గా నిలిచిన మైసూర్ వారియర్స్ ఈసారి కూడా కరుణ్ నాయర్ నాయకత్వంలోనే బరిలో దిగుతుంది.
తాజా వేలంలో రూ. 1 లక్షలకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను తమ జట్టులో చేర్చుకున్నారు. ప్రసిద్ధ్ ఇటీవల కాలి సర్జరీ నుంచి కోలుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో రాణించేందుకు ఆశావహుడై ఉన్నాడు.
మైసూర్ వారియర్స్ జట్టులో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉంది. ఈ సీజన్‌లో కూడా టైటిల్ గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.