ముంబై: పంజాబ్ కింగ్స్ కు నూతన కోచ్ గా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ను నియమిస్తున్నార? అవును అనే అంటున్నాయి కొన్ని కథనాలు.
ఐపీఎల్ ఇప్పటికే 17 సార్లు నిర్వహించినా ఒక్క సారి కూడా టైటిల్‌ను ఇప్పటివరకు గెలవని నాలుగు ఫ్రాంచైజీలలో పంజాబ్స్ కింగ్స్ కూడా ఒకటి.
ఐపీఎల్ టైటిల్ కోసం ఆ జట్టులో ఎన్ని మార్పులు చేర్పులూ, ప్రయోగాలు చేసినా ఇప్పటి వరకు ఆశించిన ఫలితం దక్క లేదు.
అయితే, ఇప్పటి వరకు ఆ జట్టు కోచ్ గా పని చేసిన ట్రెవర్ బేలిస్ రెండేళ్ల పదవీకాలం ఐపీఎల్ 2024తో ముగిసిపోయింది.
దీని వల్ల, ఇక ఆ స్థానంలో మాజీ ఆటగాడు అయిన వసీం జాఫర్‌ను ఆ జట్టు యాజమాన్యం నియమించనుందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది.
వసీం జాఫర్ 2019-2021 మధ్య కాలంలో పంజాబ్ కింగ్స్ కు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. కాగా, ఐపీఎల్ 2022 వేలానికి ముందు అతడు జట్టూ నుండి వైదొలగాడు.
వసీం జాఫర్ భారత జట్టు తరపున 31 టెస్టులు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఇతని వయసు 46 సంవత్సరాలు. కోచ్‌గా జాఫర్‌ను నియమిస్తే టైటిల్ వేటలో ఆ జట్టు మరో కొత్త ప్రయత్నం, ప్రయోగం చేసినట్టు అవుతుంది.
ఇదిలా ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టు 2014 తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఫ్లే ఆఫ్స్ గడప తొక్క లేకపోయింది. ఐపీఎల్ 2024లోనూ అతి పేలవమైన ప్రదర్శించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
అయితే టీ20 క్రికెట్‌లోనే అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది.
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ చేధించింది. మరో 5 వికెట్లు మిగిలివుండగానే పంజాబ్ కింగ్స్ విజయం సాధించడం గమనార్హం.