అమరావతి: వాతావరణ శాఖ ప్రకారం, ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో, నిన్న పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌కు సమీపంలో ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
అయితే, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండబోదని తెలియజేశారు. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పశ్చిమ బెంగాల్ మరియు ఝార్ఖండ్ మీదుగా ప్రయాణిస్తుంది.
అదే సమయంలో, ఒడిశా మీదుగా తూర్పు నుంచి పడమర దాకా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా, నిన్న కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.
రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వాతావరణశాఖ అధికారులు వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.