అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, మంగళవారం అమరావతిలో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌ను కలిసారు.
ఈ సందర్భంగా, ఆయన కాన్సులేట్ జనరల్ బృందాన్ని సత్కరించారు. అనంతరం, ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు యుఎస్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి వీసాలు ఇవ్వడంలో సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు యుఎస్ లో సురక్షితంగా ఉండేలా చూడాలని కూడా కోరారు. ఇంకా, యుఎస్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించవలసిందిగా కూడా ఆయన కోరారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని, ఏ ప్రాంతంలో అయినా పెట్టుబడులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
యుఎస్ పెట్టుబడిదారులతో సమావేశమై వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని కాన్సులేట్ జనరల్‌నుఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కోరారు.