మూవీడెస్క్: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
అయితే ఈ మూవీ తర్వాత నెక్స్ట్ రామ్ పోతినేని చేయబోయే సినిమాపై ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పి.మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రేపో మాపో అఫీషియల్ క్లారిటీ రావచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక మూవీకి సంబందించిన క్యాస్టింగ్ సెలక్షన్ లో బిజీగా ఉన్న మేకర్స్.. మరో సీనియర్ హీరోను కీలక పాత్రలో చూపించనున్నట్లు టాక్ వస్తోంది.
ఆ సీనియర్ హీరో మరెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలయ్య పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట.
దీంతో మల్టీస్టారర్ చిత్రంగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. రామ్ పోతినేని, బాలయ్య ఇద్దరు కూడా హైఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడతారు.
కాబట్టి వారి కాంబినేషన్ పై డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలకృష్ణ నటించారు.
అందులో కూడా ఆయన పవర్ ఫుల్ రోల్ లోనే కనిపించారు. ఒక వేళ బాలయ్య రామ్ ప్రాజెక్టును వెంటనే యాక్సప్ట్ చేస్తే మాత్రం ఈ కాంబినేషన్ కి అదిరిపోయే క్రేజ్ రావడం పక్కా.