fbpx
Thursday, November 28, 2024
HomeBig Storyఒలింపిక్స్ ఉదంతం: యాంజెలా వైదొలగడం పై దుమారం

ఒలింపిక్స్ ఉదంతం: యాంజెలా వైదొలగడం పై దుమారం

Italian boxer-Angela-Algerian boxer-Imeni Khelif

పారిస్‌: ఇటలీకి చెందిన బాక్సర్ యాంజెలా ఉన్నట్లుండి బౌట్ నుంచి తప్పుకున్న ఉదంతం ఉత్సాహభరితంగా జరుగుతున్న ఒలింపిక్స్ వేదికలో సంచలనంగా మారింది.

ఆమె ఆల్జీరియా బాక్సర్ ఇమేని ఖెలిఫ్‌తో బౌట్‌ మొదలైన 40 సెకండ్లకే రింగ్ నుంచి నిష్క్రమించింది.

ఖెలిఫ్ పంచ్‌ల వల్లే ఆమె తట్టుకోలేకపోయిందని, కానీ నేరుగా నాకౌట్ కావడం జరగలేదు.

యాంజెలా రెండుసార్లు ఖెలిఫ్ పంచ్‌లు తిన్న మాట వాస్తవమే. ఒక పంచ్‌కు ఆమె ముక్కు పగిలి రక్తం వచ్చింది. కానీ ఆ గాయం వల్ల కాకుండా, ఆమె కొనసాగించలేని స్థితిలో ఉందని చెప్పి వైదొలిగింది.

తాను ఎందుకు కొనసాగించలేనని యాంజెలా వెల్లడించకపోయినా, ఆమె కన్నీళ్లతో నిష్క్రమించిన తీరును బట్టి అందరికీ విషయం అర్థమైపోయింది.

ఖెలిఫ్ పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనే విషయం గతంలో వెల్లడైంది.

2023లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సమయంలో ఖెలిఫ్‌కు పరీక్షలు నిర్వహించగా, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో ఆమెను పోటీల నుంచి నిష్క్రమించారు.

కానీ ఒలింపిక్స్‌కు ఆ రూల్స్ వర్తించవు. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ‘మహిళ మహిళే’ అనే ఉద్దేశంతో పోటీలకు అనుమతిస్తున్నారు.

తైవాన్‌కు చెందిన లిన్ యు టింగ్ సైతం ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది.

Taiwan’s Lin Yu Ting and Algerian boxer Imeni Khelif

యాంజెలా మాట్లాడుతూ, ఖెలిఫ్ ఇచ్చిన పంచ్‌ గురించి ఇంత బలమైన పంచ్ తన జీవితంలో ఎదుర్కోలేదని పేర్కొంది. “అమ్మాయిలకు ఇలాంటి పంచ్ సాధ్యం కాదు” అంటూ ఆమె చెప్పింది.

ఖెలిఫ్ మీద నేరుగా ఆరోపణలు చేయకపోయినా, తాను వైదొలగడానికి ఆమెలో పురుష లక్షణాలు ఎక్కువ ఉండడమే కారణం అని అనుమానం వ్యక్తం చేసింది.

ఈ ఉదంతం సోషల్ మీడియాను ఊపేసింది. ‘ఎక్స్’ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సహా చాలామంది “మహిళల ఈవెంట్లో పురుషులను ఎలా ఆడిస్తారు?” అంటూ ప్రశ్నించారు.

నిన్నట్నుంచి ఒలింపిక్స్‌కు సంబంధించి మిగతా విషయాల కంటే ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular