fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమాస్ డైరెక్టర్ తో మెగాస్టార్ న్యూ కాంబినేషన్

మాస్ డైరెక్టర్ తో మెగాస్టార్ న్యూ కాంబినేషన్

MEGASTAR-WITH-MASS-DIRECTOR-HARISH-SHANKAR
MEGASTAR-WITH-MASS-DIRECTOR-HARISH-SHANKAR

మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్ లో కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య వంటి హిట్ చిత్రం తరువాత, అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ కథాంశంతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ప్లాన్ అవుతోందని ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల హరీష్ శంకర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి కథ చెప్పిన విషయం బయటకు వచ్చింది.

ఈ కథ చిరంజీవికి బాగా నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని హరీష్ శంకర్ తెలిపారు.

మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై పూర్తిగా దృష్టి సారించనున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత, హరీష్ శంకర్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.

మెగాస్టార్‌తో హరీష్ శంకర్ డైరెక్షన్ అంటే అభిమానులకు మరింత ఆసక్తి కలిగిస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular