ఒలింపిక్స్: భారత క్రీడాభిమానులకు తీవ్ర నిరాశపరుస్తూ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కి ఒలింపిక్స్‌లో అనర్హతకు గురయ్యారు.
50 కేజీల విభాగంలో పోటీకి ముందు వినేశ్ బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో, నిర్వాహకులు ఆమెపై అనర్హత విధించారు.
దీంతో ఆమె ఫైనల్‌కు చేరినా, పోటీలో పాల్గొనలేకపోయారు. ఈ సంఘటన క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపరచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ, “వినేశ్, నువ్వు చాంపియన్లలో చాంపియన్. నీవు భారతీయుల గర్వకారణం, ప్రతి భారతీయునికి స్పూర్తి. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ బాగా బాధిస్తుంది. ఈ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదుర్కోవడం నీకు తెలుసు, ఆ క్రమంలో నీకు అండగా మేముంటాం” అని పేర్కొన్నారు.
వినేశ్ ఫోగాట్ గతంలో రియో 2016 మరియు టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసి, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలవడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నారు.
ఈ అనర్హత ఆమెకు మరియు క్రీడాభిమానులకు పెద్ద దెబ్బతీసింది.