మూవీడెస్క్: రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా చివరి షెడ్యూల్ మాత్రమే షూటింగ్ మిగిలి ఉండగా, నిర్మాత దిల్ రాజు ఇటీవల సినిమా క్రిస్మస్ 2024లో విడుదల అవుతుందని ప్రకటించారు.
ఈ ప్రకటనతో, మెగా ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహం నెలకొంది. గేమ్ ఛేంజర్ డబ్బింగ్ సెషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ప్రేక్షకులు రాజు గారి మాటలపై నమ్మకం ఉంచారు.
క్రిస్మస్ విడుదల కావడంతో థియేటర్లలో గేమ్ ఛేంజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో, అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 కూడా డిసెంబర్‌లో విడుదల కావడంతో, రెండు భారీ సినిమాల మధ్య పోటీని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. చరణ్ ఒక పాత్రలో ఐఎస్ గా కనిపించనుండగా, ఫ్లాష్ బ్యాక్ లో పొలిటీషియన్ గా మరొక పాత్రలో కనిపించనున్నారు.
అలాగే అంజలీ, కియరా అద్వానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.