
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే ఏపీలో 54 మరణాలు సంభవించాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. కాగా, ఆదివారం ఒక్క రోజే 33 ,580 మందికి పరీక్షలు నిర్వహించగా 4,074 మందికి పాజిటివ్ అని తేలింది. దీనితో కరోనాతో బాధపడ్తున్నవారి సంఖ్య 53,724 కి చేరింది.
ఇదిలా ఉండగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే అనంతపురంలో 342, శ్రీకాకుళంలో 261, చిత్తూరులో 116, గుంటూరులో 596, కడపలో 152, నెల్లూరులో 100, విశాఖపట్నంలో 102, కృష్ణాలో 129, పశ్చిమ గోదావరి జిల్లాలో 354, విజయనగరంలో 56 కేసులు నమోదయ్యాయి.