పారిస్: ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో ఈవెంట్లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా, 89.45 మీటర్ల సీజన్ బెస్ట్ త్రోతో పతకం గెలుచుకున్నాడు.
కాగా, భారత్ కు ఒలంపిక్స్ 2024 లో ఇది తొలి రజత పతకం. ఇంతకు ముందు వచ్చిన పతకాలన్ని కాంస్య పతకాలే.
అయితే, పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల కొత్త ఒలింపిక్ రికార్డ్ స్థాయి త్రో వేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అర్షద్ నదీమ్ ఒలింపిక్ పతకం గెలుచుకున్న మొదటి పాకిస్తాన్ క్రీడాకారుడిగా నిలిచాడు.
2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్సెన్ స్థాపించిన 90.57 మీటర్ల పాత ఒలింపిక్ రికార్డును అర్షద్ నదీమ్ బ్రేక్ చేశాడు.
గ్రెనెడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ కాంస్య పతకాన్ని 88.54 మీటర్ల త్రోతో గెలుచుకున్నాడు.
అయితే, మూడు సంవత్సరాల క్రితం టోక్యో సమ్మర్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న నీరజ్, ఈ మంగళవారం పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో 89.34 మీటర్ల భారీ త్రోను నమోదు చేశాడు.