న్యూఢిల్లీ: అనుకున్నట్లే జరిగింది, మొత్తానికి టి20 ప్రపంచకప్ 2020 వాయిదా పడింది. ఈ మెగా ఈవెంట్ ని వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
ఆదివారం జరిగిన ఐసీసీ వర్చువల్ మిటింగ్ లో టి20 ప్రపంచకప్ నిర్వహణ పై సాధ్యాసాధ్యాలపై చాలా సేపు చర్చించింది. అత్యంత ప్రజాదరణ పొందిన పొట్టి కప్ అక్టోబర్-నవంబర్ లో నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆస్ట్రేలియా ఈ కరోనా పరిస్థితుల్లో నిర్వహించలేమని ఇప్పటికే ప్రకటించింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సభ్యులు అందరూ దాదాపుగా ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్ల భద్రత, ఆరోగ్య జాగ్రత్తలు చూసుకోవడం ఇబ్బంది అవుతుందని అభిప్రాయానికి ఐసీసీ వచ్చింది.
అన్ని సమాలోచనలు చేసిన తరువాత ఈ ఏడాది నిర్వహించాల్సిన ప్రపంచకప్ ను వచ్చే సంవత్సరం అక్టోబర్-నవంబర్ లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఐసిసీ ప్రకటించింది. షెడ్యులుకు సంబంధించిన మరియు మిగిలిన సమాచారాన్ని త్వరలోనే ఐసీసీ టీం ప్రకటిస్తామంది.