మూవీడెస్క్:యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో మంచి మార్కెట్ కలిగిన నటుడిగా పేరు సంపాదించారు.
‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందిన విశ్వక్ సేన్, ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విశ్వక్ సేన్ సినిమాలకు బిజినెస్ పరంగా కూడా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా, ఆయన తన రెమ్యూనరేషన్ను పెంచినట్లు సమాచారం.
ఒకో సినిమాకు 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి సంస్థలు ఈ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
‘లైలా’ వంటి ప్రాజెక్ట్ కోసం పాత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆయన, తరువాతి సినిమాలకు ఈ కొత్త రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు.
అనుదీప్ తో ఇప్పటికే ఒక కథ లాక్ అయినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ థియేట్రికల్ గానే కాకుండా, డిజిటల్ బిజినెస్ ద్వారా నిర్మాతలకు మంచి రిటర్న్స్ అందిస్తూ, యువ హీరోలలో అతని స్థాయిని పెంచుకుంటున్నాడు.
‘మెకానిక్ రాకీ’, ‘లైలా’, తదితర సినిమాలపై కూడా టాలీవుడ్ లో మంచి బిజినెస్ డీల్స్ సెట్టయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.