మూవీడెస్క్:ప్రసిద్ధ జ్యోతిష్యుడైన వేణుస్వామి ఇటీవల నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వేణు స్వామి, ఈ జంట జాతకాలను బట్టి మూడేళ్లలో విడిపోతారని చెప్పడం వివాదానికి దారితీసింది.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో, మంచు విష్ణు వివాదంలో కలగజేసుకొని, వేణుస్వామితో ఫోన్‌లో మాట్లాడారు.
సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. వేణుస్వామి, మంచు విష్ణు మాటలను గౌరవిస్తూ, ఇక నుంచి టాలీవుడ్ సెలబ్రెటీల జ్యోతిష్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు.
ఈ వివాదం, మంచు విష్ణు మధ్యవర్తిత్వంతో సులభంగా ముగిసింది. వేణుస్వామి తన గత వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, ఇకపై ఎలాంటి జ్యోతిష్య వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించడంతో ఈ వివాదం ముగిసినట్లైంది.
గతంలో వేణుస్వామి సమంత – నాగచైతన్య పై కూడా పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పొలిటికల్ లీడర్స్ పై కూడా ఆయన చేసిన విశ్లేషణ తప్పడంతో పాలిటిక్స్ గురించి కూడా ఇక నుంచి మాట్లాడనని అన్నారు.