fbpx
Thursday, November 28, 2024
HomeNationalఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనకు కలకత్తా హైకోర్టులో...

ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటనకు కలకత్తా హైకోర్టులో విచారణ

brutal incident-against a woman doctor-Kolkatta-Medical College

కలకత్తా: కలకత్తా ఆర్‌జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించి ఈరోజు కలకత్తా హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PIL) దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివగణనం నేతృత్వంలోని డివిజన్ బెంచ్, విచారణలో లోపాలపై ప్రశ్నలు లేవనెత్తింది.

ముఖ్యంగా, అప్పటి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వాంగ్మూలం నమోదు చేయడంపై కోర్టు సంతృప్తి చెందలేదు. ప్రిన్సిపాల్‌గా రాజీనామా చేసిన ఘోష్‌ను కొద్దిసేపటికే తిరిగి నియమించడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కోర్టు, ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో ఎలా నియమించారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం దీనికి సమాధానం ఇవ్వాల్సి ఉందని కోర్టు పేర్కొంది.

అంతేకాకుండా, కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని కూడా ప్రశ్నిస్తూ, ఘోష్‌ను ఎందుకు కాపాడుతున్నారని, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది.

“మీరు ఆయ‌న‌ను ఎందుకు కాపాడుతున్నారు? వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయండి. వారికి తెలిసిన వాటిని మీకు చెప్పనివ్వండి. ఈ కేసుకు సంబంధించిన కేసు డైరీని ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కోర్టులో దాఖలు చేయాలని” ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశించింది.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోగా సెలవు దరఖాస్తును సమర్పించాలని లేని పక్షంలో ఆయన పదవి నుంచి వైదొలగాలని కోర్టు ఆదేశించనుంది.

ప్రిన్సిపాల్‌ రాజీనామా లేఖ, అపాయింట్‌మెంట్ లెటర్‌ను సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని కోరారు. ఆయన రాజీనామాలో ఏం రాశారో చూడాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular