మూవీడెస్క్: పవన్ వ్యాఖ్యలపై హరీష్ శంకర్ స్పందన. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల అటవీశాఖ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఇప్పటి సినిమాల్లో అడవులను స్మగ్లింగ్ చేసే పాత్రలను హీరోలుగా చూపిస్తున్నారు.
అది కరెక్ట్ కాదు.. నేను అలాంటి పాత్రల్లో నటించడం ఇష్టపడను అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన స్మగ్లర్ పాత్రపై ఉద్దేశించాయని, బన్నీ అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పవన్ ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని స్పష్టం చేశారు.
అయితే, తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఆయన రవితేజ హీరోగా తెరకెక్కించిన “మిస్టర్ బచ్చన్” సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి అని అన్నారు.
ఆయన సామాజిక బాధ్యత ఉన్న నాయకుడు. అందువల్లే ఆయన అటవీశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆ సందర్భంలో మాత్రమే అలా అన్నారు.
పుష్ప సినిమా చూసి ఎవరూ గొడ్డళ్లు పట్టుకొని అడవులకు వెళ్లలేదు. సినిమాలు ఎప్పుడూ కేవలం వినోదం కోసం మాత్రమే, జనాలు వాటిని నిజ జీవితంలో పాటించడం లేదు” అని వ్యాఖ్యానించారు.