మూవీడెస్క్:యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల “గామి” మరియు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
“గామి” కమర్షియల్ సక్సెస్ సాధించగా, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కూడా మంచి స్పందన పొందింది. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
విశ్వక్ సేన్ ప్రస్తుతం ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మెకానిక్ రాకీ” సినిమా అక్టోబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత, విశ్వక్ లైన్ అప్‌లో మరొక మూడు డిఫరెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటిలో మొదటి సినిమా “లైలా”, రామ్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతోంది. అలాగే “గంటా శ్రీధర్” దర్శకత్వంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో రూపొందనున్న సినిమా రానుంది.
“జాతి రత్నాలు” ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వంలో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ రెడీ అవుతోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఇవి కాకుండా, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా విశ్వక్ సేన్ ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.