ముంబై: టీమిండియాకు నూతన బౌలింగ్ కోచ్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇటీవలే గౌతం గంభీర్ ప్రధాన కోచ్ గా నియమితులైనారు.
కాగా, తాజాగా టీమీండియా కు బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నే మోర్కెల్ ఎంపికైనట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ తెలిపింది.
అయితే ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. హెడ్ కోచ్ గౌతం గంభీర్ సిఫారసు మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, మోర్నే మోర్కెల్ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలిపారు.
క్రితంలో మోర్నే మోర్కెల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు మరియు పాకిస్తాన్ కు కోచ్ గా పని చేసిన అనుభవం ఉంది.