fbpx
Friday, September 20, 2024
HomeMovie Newsతంగలాన్ : మరోసారి విక్రమ్ విశ్వరూపం

తంగలాన్ : మరోసారి విక్రమ్ విశ్వరూపం

VIKRAM-ROCKS-AGAIN-WITH-THANGALAAN
VIKRAM-ROCKS-AGAIN-WITH-THANGALAAN

మూవీడెస్క్: తంగలాన్ సినిమాలో విక్రమ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా సరే నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విక్రమ్, తంగలాన్ మూవీతో మరోసారి పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు.

రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక డిఫరెంట్ మూవీగా హైలెట్ అయ్యింది.విక్రమ్ కెరీర్‌లో అపరిచితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత, అతని కెరీర్‌లో పెద్ద విజయాలు తక్కువే.

అయినప్పటికీ, విక్రమ్ ఎప్పుడూ విభిన్నమైన కథలకే ప్రాధాన్యం ఇస్తూ, తన పాత్రలతో ఆడియన్స్‌ని మెప్పించడంలో ముందుంటాడు.

తంగలాన్ సినిమాలో విక్రమ్, గోచి ధరించిన పాత్రలో కనిపిస్తూ, ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే విశ్వరూపం చూపించాడు.

ఈ సినిమా పూర్తిగా విక్రమ్‌దే అన్న రేంజ్ లో ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసినంతసేపు ఎక్కడా విక్రమ్‌ను గుర్తుపట్టలేరు, కేవలం పాత్రే కనిపిస్తుంది.

తంగలాన్ సినిమా విడుదలైన తరువాత, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. అడ్వెంచర్ సీన్స్, కథనంలోని ఎమోషనల్ ఎలిమెంట్స్, అన్నీ విక్రమ్ నటనతో మిళితమై, సినిమా ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular