మాంచెస్టర్: వెస్టిండీస్‌పై రెండో టెస్టును గెలిచి సిరీస్ సమం చేసింది ఇంగ్లండ్. 113 పరుగులతో గెలిచిన రూట్ సేన 1–1తో సిరీస్‌ను గెలిచే అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మ్యాచ్ చివరి రోజైన సోమవారం దూకుడైన బ్యాటింగ్‌తో 11 ఓవర్లకే డిక్లేర్ చేసి ప్రత్యర్థికి 85 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చింది.
ఇంగ్లండ్ విసిరిన 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ తడబడీ ఓడింది. ఈ మ్యాచ్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్ విజయంలో బెన్ ముఖ్య భూమిక పోషించాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి, రెండో ఇన్నింగ్స్ లో 36 బంతులలోనే 56 పరుగులు సాధించి ఇంగ్లండ్ ఓపెనర్ గా వేగమైన హాఫ్ సెంచరీ నమోదు చేసాడు. ఇందులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ ఓపెనర్‌గా దిగడం గమనార్హం.
మొత్తానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన ఇంగ్లండ్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్ ఓల్డ్ ట్రపోర్డ్ మైదానంలో ఆడనుంది.