మూవీడెస్క్: అల్లు అర్జున్ తన లుక్స్‌తో ఎప్పటికప్పుడు అభిమానులకు కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. ‘పుష్ప’ సినిమాలో అతని గడ్డం లుక్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే, ఇటీవల అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ‘పుష్ప 2‘ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ మార్పు రావడంతో చాలామంది అనేక సందేహాలు వ్యక్తం చేశారు.
గడ్డం ట్రిమ్ చేయడం వెనుక కారణాలు ఏమిటో అని కొందరు చర్చించుకుంటున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పుష్ప 2 షూటింగ్‌లో చిన్న బ్రేక్ ఉండడం వలన బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేశారట.
అయితే ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ గడ్డం పెంచి పుష్పరాజ్ లుక్‌లో తిరిగి కనిపిస్తారనే టాక్ వచ్చింది. కానీ షూటింగ్ వెంటనే ప్రారంభం కావడంతో గడ్డం లేకపోవడంతో కొత్త సమస్య వచ్చిందట.
దీంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక నిపుణుడిని పిలిపించారని టాక్. ఈ నిపుణుడు బన్నీకి కృత్రిమ గడ్డాన్ని అందించినట్లు తెలుస్తోంది.
ఈ గడ్డం సహజంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా, ఈ కృత్రిమ గడ్డం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు కూడా వినిపిస్తోంది.
ఇండస్ట్రీలో ఇంత వరకు ఇంత భారీగా గడ్డం కోసం ఖర్చు చేయలేదని చెబుతున్నారు.