ముంబై: అమెజాన్ ఇండియా ప్రైమ్ డే 2020 షెడ్యూల్‌ను ప్రకటించింది. యుఎస్ ఇ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ఈ సంవత్సరపు సేల్స్ కార్యక్రమం ఆగస్టు 6 నుండి ఆగస్టు 7 వరకు జరుగుతుందని ప్రకటించింది.
ఇది భారతదేశంలో నాల్గవ ప్రైమ్ డే సేల్, కొన్ని గొప్ప ఒప్పందాలు మరియు కొత్త లాంచ్‌లను ఈ సేల్ లో అమేజాన్ తేనుందని సమాచారం. అమెజాన్ తన ప్రైమ్ డే అమ్మకాన్ని ఆగస్టులో నిర్వహించడం ఇదే మొదటిసారి – సాధారణంగా జూలైలో నిర్వహించే ప్రైమ్ డే కరోనా వైరస్ కారణంగా ఆలస్యమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇ-కామర్స్ వ్యాపారాలు కరోనా వల్ల దెబ్బతిన్న సంగతి తెలిసిందే. .
ఈ రెండు రోజుల సేల్ ఈవెంట్ లో మొబైల్స్, ల్యాప్ టాప్స్, ఇంకా ఇతర ఎలక్ట్రానిక్స్ పై ఆఫర్లు ఉండనున్నాయి. ఇక హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్స్ కి 10 శాతం డిస్కౌంట్ ను కంపెనీ ప్రకటించింది. అలాగె ఎంపిక చేసిన ఉత్పత్తులపై నో-కాస్ట్ ఈ ఎం ఐ వెసులుబాటును కూడా అందిస్తోంది.
అమెజాన్ ప్రతి సంవత్సరం పైం డే సేల్ ను అమెరికా మరియు భారత్ లో ఒకేసారి జరపడం చూసాం. ఐతే ఈ సారి అమెజాన్ కరోన వైరస్ ప్రభావం వల్ల ఇంకా అమెరికాలో సేల్ షెడ్యూల్ విడుదల చేయలేదు. ఈ సేల్ కి కావల్సిన అమెజాన్ ప్రైం మెంబర్ షిప్ నెలకు రూ 199/-, లేదా వార్షిక మెంబర్ షిప్ రూ 999/- గా ఉంది.