అమరావతి: కరోనా ఎవరినీ వదలడం లేదు. చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే భేధం లేదు. డబ్బు ఉన్నోనికి భయపడదు, డబ్బు లేనోడని జాలి పడదు. సినిమా సెలబ్రిటీలైనా రాజకీయ నాయకులైనా కరోనా దెబ్బకు ఖంగు తింటున్నారు.
ఇప్పటికే ఏపీ లో పలువురు ఎమెల్యేలకు సోకిన కరోనా వైరస్ తాజాగా ఆ పార్టీ ఎంపీ మరియు పార్టీ పార్లమెంటరీ నేత అయిన విజయసాయి రెడ్డికి కూడా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
కరోనా నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్వీయ నియంత్రణలో ఉంటున్నానని, కొన్ని రోజులు ఎవరికీ అందుబాటులో ఉండనని, అత్యవసర ఫోన్ కాల్స్ మాత్రమే స్వీకరిస్తానని తెలిపారు. ఆయన తో పాటు తన పీఏ కి కూడా పాజిటివ్ వచ్చిందని సమాచారం.
అయితే ఆయన ఈ విషయం సూటిగా చెప్పలేదు. ఈ విషయమై ట్విట్టర్ లో మాటల యుద్ధం, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.