మూవీడెస్క్:సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కొత్త ప్రాజెక్ట్ SSMB29 కోసం కొత్త లుక్ లో కనిపించడం అభిమానుల్లో భారీ అంచనాలను తెచ్చిపెట్టింది.
కొత్త లుక్ లో మహేశ్ ఉన్న ఫోటోలను చూసిన అభిమానులు, దీనిని రాజమౌళి డైరెక్షన్ లో రాబోయే సినిమా కోసం అనుకుంటున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. కథ ఏంటి, కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
కేవలం రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్ ఆధారంగా ఇది ఆఫ్రికా అడ్వెంచర్ నేపథ్యంలో ఉండబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ లుక్ కారణంగా అభిమానులు సినిమాపై మరింత ఆసక్తిగా ఉన్నారు. ఇక రీసెంట్ గా ఒక ఆర్ట్ ఫ్రేమ్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినిమా టైటిల్ పై చర్చలు మొదలయ్యాయి.
ఆర్ట్ లో ఉన్న రెండు రెక్కలు గరుడ టైటిల్ వైపు సంకేతాలు ఇస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, SSMB29కు గరుడ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ వచ్చింది.
మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీ గురించి రకరకాల రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. 2028లో ఈ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
కానీ ప్రీ ప్రొడక్షన్ ఇంకా కొనసాగుతున్నందున, విడుదల గురించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన కోసం మరికొంత సమయం వేచి చూడాలి.