బాలీవుడ్: ఇండియా లో ఉన్న ప్రముఖ నవలా రచయితల్లో ఎక్కువగా వినిపించే పేరు చేతన్ భగత్. కొత్తగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకునే వాళ్ళకి కూడా ఆయన పుస్తకాలే సజెస్ట్ చేస్తూ ఉంటారు కొందరు. ఆయన రాసిన చాలా నవలలు బెస్ట్ సెల్లర్స్ కాగా దాదాపు అన్ని నవలలు సినిమాలు గా తీయబడి సూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అయితే ఈయన క్రిటిక్స్ పైన క్రిటిక్ రైటింగ్ పైన కొంచెం గట్టిగానే విరుచుకుపడ్డాడు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది వాళ్ళ వల్ల జీవితాలు ఎలా రోడ్డున పడతాయి లాంటి విషయాలు ట్వీట్ చేసాడు.
ఇండియా లో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా కష్టం అని , ఈ ఇండస్ట్రీ లో కనీసం బతకడం ఒక గొప్ప విజయం అని చెప్పారు. పెద్ద పెద్ద యాక్టర్స్ మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మంది ఉంటారని సినిమా మేకింగ్ లో వాళ్ల పాత్ర కూడా ఉంటుందని చెప్పారు. ఇలా వాళ్ళకి గ్రేడ్స్ ఇవ్వడం అనేది లేని ప్రెషర్ క్రియేట్ చేయడమే అని చెప్పారు. నువ్ ఒకవేళ ఇండస్ట్రీ లో జీవించగలుగుతున్నావు అంటే నువ్వు స్టార్ అన్నట్టే అని ట్వీట్ చేసారు.
అలాగే ఇక్కడ ఒక క్రిటిక్ ఉన్నాడని అతను తన రైటింగ్ కెరీర్ నాశనం చేయడానికి చూశాడని , ఆ క్రిటిక్ కి సొంతంగా కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చే వాళ్ళు, చిన్న టౌన్స్ నుండి కాన్ఫిడెన్స్ తో వచ్చే వాళ్ళు నచ్చరని, ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళన్నా నచ్చరని, అతనే సుశాంత్ ని కూడా తొక్కేయ్యడానికి చాలానే ప్రయత్నించాడని చెప్పాడు. కానీ ఆ క్రిటిక్ ఎవరో చెప్పలేదు. అలాగే ఇలాంటి క్రిటిక్స్ ని ఉద్యోగం లోకి తీసుకునే మీడియా కంపెనీలకి కూడా ముందు ముందు కష్టాలుంటాయని వీళ్ళు బయటకి నల్ల తోలు కప్పుకున్న కపటదారులని ట్వీట్ చేసారు.
అలాగే తన రచనలపైన సినిమాలు తీసిన సినిమాలకి బెస్ట్ స్టోరీ అవార్డులు చాలా వచ్చాయని కానీ ఒక్కటి కూడా తన వద్దకి రాలేదని అన్ని వాపోయారు. అలాగే ఇంకా సినిమా ఇండస్ట్రీ లోని చాలా విషయాలపైన ఆయన ట్వీట్లు పెట్టారు.