మూవీడెస్క్: టాలీవుడ్‌కు వినూత్న కథలతో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుల్లో సందీప్ వంగా ఒకరు. ఆయన తెరపైకి తీసుకొచ్చిన కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ వంగా, రెండు సినిమాలతోనే భారీ క్రేజ్‌ను సంపాదించుకున్నారు.
సందీప్ వంగా స్పెషాలిటీ ఏమిటంటే, ఆయన తీసే కథలు యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్‌లో రీమేక్ అయిన ‘కబీర్ సింగ్’ కూడా అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది.
అనంతరం యానిమల్ అంతకుమించి అనేలా సక్సెస్ ను అందుకుంది. ఈ రెండు సినిమాలు ఆయనకు భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకొచ్చాయి.
ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సందీప్ ఈ ఏడేళ్ళ టైమ్ లో అర్జున్ రెడ్డి, యానిమాల్ అనే రెండు కథలే తెరపైకి తీసుకు వచ్చాడు.
అయినప్పటికీ రాజమౌళి రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. అయితే ఆయన వర్క్ స్పీడ్ కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి సందీప్ వంగా స్పీడ్ పెంచాల్సిన టైమ్ వచ్చింది. ప్రభాస్ స్పిరిట్ అనంతరం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అలాగే యానిమల్ 2 కూడా లిస్టులో ఉంది.