హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల చర్యలతో ప్రజలను ఆకర్షిస్తున్న హైడ్రా సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ప్రవేశించింది.
ఇటీవల ప్రముఖ నటుడు, నిర్మాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌తో పాటు, చెరువులు, కుంటలు, మరియు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది.
ఇటీవల ‘హైడ్రా’ సంచలనంగా మారిన ఈ చర్యలను ప్రజల ముందు చూపించేందుకు “ఎక్స్” అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ‘కమిషనర్ హైడ్రా’ పేరుతో ఖాతాను ప్రారంభించింది.
ఈ ఖాతా గతంలో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ విజలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈడీవీఎం) ఖాతానే ‘హైడ్రా’గా మార్చినట్లు భావిస్తున్నారు.