fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsపుష్ప 3 పై మరో క్రేజీ అప్డేట్

పుష్ప 3 పై మరో క్రేజీ అప్డేట్

PUSHPA-3-CRAZY-UPDATE-ON-SEQUEL
PUSHPA-3-CRAZY-UPDATE-ON-SEQUEL

మూవీడెస్క్: అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప రాజ్ పాత్ర ఓ కీలక మలుపు అని చెప్పొచ్చు. పుష్ప సినిమా ఆయనకు ఒక అపూర్వమైన గుర్తింపును తెచ్చింది.

నేషనల్ అవార్డు గెలవడంతో ఈ పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సీక్వెల్ పుష్ప: ది రూల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సీక్వెల్‌కి సుకుమార్ మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో మాత్రం అంచనాలు తగ్గలేదు.

పుష్ప 2 లో పుష్ప రాజ్ పాత్ర మరింత బలంగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇక పుష్ప 3 కూడా భవిష్యత్తులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పుష్ప 2 తర్వాత, పుష్ప 3 కూడా ఉండబోతుందా అనే ప్రశ్నకు ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్‌లు క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక పుష్ప సీక్వెల్‌కి కొనసాగింపు ఉంటుందని, పుష్ప 2 క్లైమాక్స్‌లో మూడో భాగానికి లీడ్ ఇవ్వబోతున్నట్లు టాక్ వస్తోంది.

అయితే, పుష్ప 2 పూర్తయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక పౌరాణిక కథాంశం ఉన్న సినిమాను చేయబోతున్నారు.

అలాగే, సందీప్ రెడ్డి వంగా, అట్లీ లాంటి దర్శకులతో కూడా ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, పుష్ప 3 కోసం కాస్త సమయం పట్టవచ్చని, ఆలోపు సుకుమార్ కూడా రామ్ చరణ్, విజయ్ దేవరకొండలతో ప్రాజెక్ట్స్ పూర్తి చేయవచ్చని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular