మూవీడెస్క్: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆగస్టు 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
గతంలో నాని నటించిన దసరా సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు సరిపోదా శనివారం కూడా అలాంటి సక్సెస్ సాధిస్తుందా అనే ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హై రేంజ్ లోనే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు 25 కోట్లకు రిలీజ్ రైట్స్ కొనుగోలు చేసినప్పటికీ, ఆ వ్యాల్యూ ఇప్పుడు 30 కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్లో కూడా నాని కెరీర్ లో ఇప్పటి వరకు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచినట్లు సమాచారం.
మొత్తంగా, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 43 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. నాని గత చిత్రాల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈ టార్గెట్ పెద్దది కాదని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
సినిమాలో కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే, 50 కోట్ల వరకు ఈజీగా చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయతో నానికి ఇది రెండో చిత్రం కావడం విశేషం.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా క్లాస్ మూవీగా నిలిచింది. ఈ సారి, మాస్ ఎంటర్టైనర్తో వీరిద్దరూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.