మూవీడెస్క్: నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం‘ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.
అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నానితో వర్క్ చేసిన దర్శకులు అందరూ కూడా హాజరయ్యారు. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దేవా కట్టా కూడా కనిపించారు.
వెన్నెల సినిమాతో దర్శకుడుగా కెరియర్ స్టార్ట్ చేసిన దేవా కట్టా మొదట్లోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
ఐదేళ్ల గ్యాప్ తీసుకొని ప్రస్థానం సినిమా చేశారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా సాధించింది.
ఆ తర్వాత నాలుగేళ్లకి నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య మూవీ చేశారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
2019లో ప్రస్థానం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. 2021లో సాయిధరమ్ తేజ్ హీరోగా రిపబ్లిక్ అనే మూవీని దేవకట్టా చివరిగా తెరకెక్కించారు.
ఈ సినిమా బాగుందని టాక్ సొంతం చేసుకున్న కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది.
దీని తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాలు దేవకట్టా అనౌన్స్ చేయలేదు. అయితే నానితో మూవీ చేయడానికి దేవా కట్టా ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారంట.
దేవా కట్టా తన స్టైల్ లోనే సోషల్ ఎలిమెంట్ తో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రెడీ చేసి నానికి వినిపించారని టాక్ నడుస్తోంది.
త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తోంది. సరిపోదా శనివారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దేవా కట్టా రావడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.