మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో మరోసారి టాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్నారు. “అఖండ,” “వీర సింహారెడ్డి,” “భగవంత్ కేసరి” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది.
ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) తో కలిసి ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది, సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇక బాలకృష్ణ తన సినిమాలతో పాటు ఇతర రంగాల్లో కూడా దూసుకుపోతున్నారు. “అన్ స్టాపబుల్” టాక్ షో తో ఆహా ప్లాట్‌ఫారంపై రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసుకున్నారు.
మూడవ సీజన్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతోంది. సినిమాలకే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా బాలకృష్ణ బిజీగా ఉన్నారు.
ఇటీవల జ్యూయిలరీ మాల్ కోసం ఆయన చేసిన యాడ్ లో ట్రెడిషనల్ పట్టు బట్టలలో కనిపించడం నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ లుక్ బాలకృష్ణ అభిమానుల్లో పెద్ద ఎత్తున స్పందన తీసుకువచ్చింది. ఈ ట్రెడిషనల్ గెటప్ తో ఒక కుటుంబ కథా చిత్రంలో బాలయ్య కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ గతంలో “నరసింహ నాయుడు,” “సమరసింహా రెడ్డి” వంటి కుటుంబ కథా చిత్రాలతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
కానీ ఈసారి పూర్తి ఎమోషనల్ డ్రామాతో, యాక్షన్ లేకుండా, బాలయ్య ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.