వాషింగ్టన్ : కరోనా విజృంభిస్తున్న వేళ రోజు ప్రపంచం మొత్తం మీద లక్షల సంఖ్యలో కొత్త కెసులు బయట పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని దేశాలు తమ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. తాజాగా చైనా కూడా తమ వ్యాక్సిన్ గురించి ప్రకటించింది.
ఈ సందర్భంగా చైనా వ్యాక్సిన్ గురించి ఈ విధంగా స్పందించారు:
- కరోనా వ్యాక్సిన్‌ను ఎవరు ముందుగా అభివృద్ధి చేసినా వారితో కలిసి పనిచేసేందుకు తాము ఎప్పుడు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
- తొలి కరోనా వ్యాక్సిన్‌ను చైనా అభివృద్ధి చేస్తే వారితో కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధమా అన్న ప్రశ్నకు బదులిస్తూ మనకు సత్వరమైన ప్రయోజనాలను అందించే ఏ దేశంతోనేనా పనిచేసేందుకు తాము సిద్ధమనేని అన్నారు.
- కోవిడ్-19కు ఔషధాల తయారీతో పాటు వ్యాక్సిన్ అభివృద్ధిలో అమెరికాలోవేగమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణలో కీలకమైన వ్యాక్సిన్ ఆశించినదాని కంటే ముందుగానే మార్కెట్ లోకి వస్తుందని, అమెరికా సైన్యం వ్యాక్సిన్ పంపిణీలో సహకరిస్తుండటంతో సత్వరమే అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిపై వాస్తవాలను చైనా దాచిందని ట్రంప్ పదేపదే విమర్శిస్తూ ఆ వైరస్‌ను ఏకంగా చైనీస్ వైరస్‌గా పలు సందర్భాల్లో దుయ్యబట్టారు.