మూవీడెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రాబోతున్న భారీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చాలా కాలంగా పలు ఊహాగానాలు వినిపించాయి.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?, పవన్ ముందుగా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడో అనే విషయాల్లో సందిగ్ధత నెలకొంది.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రాజెక్టులు OG మరియు హరిహర వీరమల్లు ముందుగా పూర్తి చేస్తాడని వార్తలు వచ్చాయి.
దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ మరింత ఆలస్యం అవుతుందని అందరూ భావించారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్, తాజాగా ఇచ్చిన ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ పై సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
అలాగే, ఈ ఏడాది డిసెంబర్ లో లేదా 2025 సంక్రాంతి లోపు సినిమాను పూర్తి చేసే ప్రణాళికలో ఉన్నారని అన్నారు.
అంతేకాకుండా పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక సర్‌ప్రైజ్‌గా ఓ అప్డేట్ తప్పకుండా ఉంటుందని హింట్ ఇచ్చారు.
టీజర్‌తో పాటు, అభిమానులకి అదనపు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలు, సినిమా కమిట్మెంట్స్ ని సమన్వయం చేస్తూ, తన అభిమానులకి కూడా మంచి కంటెంట్ అందించాలని ప్రయత్నిస్తుండటం విశేషం.