మెల్‌బోర్న్: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిడియాకు కరోనా మహమ్మారి నిబంధనల ప్రకారం అడిలైడ్‌లో 14 రోజుల క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక చీఫ్ నిక్ హాక్లీ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, తమ ఆటగాళ్ల నిర్బంధానికి తాము సుముఖంగా లేమని ఇటీవల తెలిపారు. అయితే ప్రపంచం అంతటా అమలవుతున్న నిబంధనల్నే తాము కుడా పాటిస్తున్నామని, ఈ నిర్బంధకాలంలో భారత ఆటగాళ్లకు, సహాయ సిబ్బందికి ఏ లోటు రాకుండా సకల సౌకర్యాలు, ఏర్పాట్లు చేస్తామని హాక్లీ తెలియజేశారు.
భారత ఆతగాళ్ళు, ఇతర సిబ్బంది కి సౌకర్యంగా ఉండడం కోసం మ్యాచ్ ఆడే స్టేడియానికి అత్యంత సమీపంలోనే హోటల్ ఉండే వేదికలను పరిశీలిస్తామని హాక్లీ వివరించారు.
అయితే ఈ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డూ (బీసీసీఐ) మండలి, స్వీయ నిర్భంధంలో ఉన్న సౌరవ్ గంగూలీ ఏ విధంగా స్పందిస్తారో, ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.