పారిస్: పారాలంపిక్స్ లో స్వర్ణం గెలిచిన సుమిత్, నితేష్. సుమిత్ ఆంటిల్, 2024 పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో రెండు సార్లు రికార్డ్ బద్దలు కొడుతూ, 70.59 మీటర్ల బెస్ట్ త్రోతో భారత్‌కు మూడో స్వర్ణ పతకాన్ని అందించారు.
అదే సమయంలో, నిత్య శ్రీవన్ SH6 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
అంతకుముందు, పారా బ్యాడ్మింటన్ స్టార్ నితేష్ కుమార్ శ్ళ్3 పురుషుల సింగిల్స్ ఫైనల్లో విజయం సాధించి, భారతదేశానికి రెండో స్వర్ణ పతకాన్ని అందించారు.
బ్యాడ్మింటన్ ఈవెంట్లో నితేష్ మాత్రమే కాకుండా, సుహాస్ యతిరాజ్ (SL4) మరియు తులసిమతి మురుగేశన్ (SU5) రజత పతకాలను గెలుచుకున్నారు.
కాగా మనీషా రామదాస్ (SU5) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. తన చేతులు లేకుండా అద్భుతమైన ఆర్చరీలో రాణిస్తున్న శీతల్ దేవి, సీనియర్ రాకేష్ కుమార్‌తో కలిసి పారా ఆర్చరీ మిక్స్డ్ టీమ్ కంపౌండ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని అందించారు.
5వ రోజు పారిస్ పారాలింపిక్స్‌లో, యోగేష్ కతునియా F56 పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో రజత పతకాన్ని గెలుచుకుని, భారత్‌కు తొలి పతకాన్ని అందించారు.
ఈ విజయాలు భారతదేశం ఖాతాలో మరిన్ని మెడల్స్ వచ్చేలా చేశాయి.