fbpx
Sunday, November 24, 2024
HomeMovie Newsకంగనా VS బాలీవుడ్

కంగనా VS బాలీవుడ్

AnuragKashyap TweetsAbout KanganaRanaut

బాలీవుడ్: సుశాంత్ మరణం తర్వాత నేపాటిసమ్ గురించి, ఇండస్ట్రీ లో పాలిటిక్స్ గురించి చాలా మంచి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దీనిపై కంగనా కూడా గట్టిగానే స్వరం వినిపించింది. ఇంతకముందు కూడా కంగనా దాదాపు తనని తొక్కివేయ్యాలన్న వాళ్ళ అందరిపైనా రివర్స్ ఎటాక్ చేసింది. అయితే ప్రస్తుతం తాప్సి అలాగే అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు కంగనా పైన కూడా ట్వీట్లతో ఎటాక్ చేస్తున్నారు. ఈ మధ్యనే తాప్సి కి కంగనా కి వాడి వేడి కామెంట్ల యుద్ధం బాగానే జరిగింది. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ వంతు వచ్చింది.

కంగనా గురించి తన ట్వీట్స్ ద్వారా అనురాగ్ కశ్యప్ ఇలా చెప్పారు –
నేను ఇదివరకు చూసిన కంగనా ఇప్పుడు చూస్తున్న కంగనా వేరు అని చెప్పారు. సక్సెస్ వచ్చిన తర్వాత అది మాట్లాడించే మాటలు వేరుగా ఉంటాయి అని చెప్పారు. నన్ను చూసి నేర్చుకో , నాలా ఉండు లాంటి మాటలు తన దగ్గరి నుండి 2015 కి ముందు చూడలేదని చెప్పారు. తన డైరెక్టర్స్ ని తిట్టడం, తన మాట వినని కో-ఆక్టర్స్ ని తీసెయ్యడం, ఎడిటింగ్ టేబుల్ పైన కూర్చొని తానే కట్స్ చెప్పడం లాంటివి తాను చేస్తుందని, తనతో పని చేయాలనుకునే డైరెక్టర్స్ తనకి దూరంగా ఉండమని సజెస్ట్ చేసాడు. కంగనా తెచ్చుకున్న పేరు ఇపుడు పక్కన వాళ్ళని తొక్కేసేలా ఉంది అన్నట్టు చెప్పారు. కానీ తనకి ఎవరు అద్దంలో తనని చూపించట్లేదని, తాను ఏం చేస్తుందో , ఏం మాట్లాడుతోందో అంతా అసలు సెన్స్ లేకుండా ఉందని తనకి ఎవరైనా చెప్పాలని సూచించారు. వీలయితే తాను కంగనా టీం తో మాట్లాడుతానని, అయినా కూడా తనకి అర్ధం అవకపోతే ఏమి చేయలేమని, అందరూ కంగనా ని వాడుకుంటారని చివరకి తాను ఒక్కతే మిగిలిపోతుందని వాపోయారు. నేను చెప్పింది అర్ధం చేసుకోకపోతే ఇప్పటినుండి నన్ను కూడా తిట్టమని కూడా చెప్పారు. తాను కంగనా ని ఇదివరకు చాలా అబిమానించానని కానీ ఇలాంటి బిహేవియర్ సహించలేనని ట్వీట్లలో చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular