పారిస్: పారిస్ లో జరుగుతున్న పారాలంపిక్స్ 2024 లో భారత్ కు రికార్డు స్థాయిలో మెడల్స్ వచ్చాయి.
ఈ పారాలంపిక్స్ ఎడిషన్ లో భారత్ ఇప్పటి వరకు 3 బంగారు పతకాలు సాధించింది. వీటితో పాటు 8 రజత, 10 కాంస్య పతకాలను సాధించింది.
ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న 21 మెడల్స్ అన్ని పారాలంపిక్స్ ఎడిషన్ లలో భారత్ కు వచ్చిన అత్యధిక మెడల్స్.
ఇందులో భారత్ కు వచ్చిన బంగారు పతకాల వివరాలు:
- సుమిత్ ఆంటల్ కు జావెలిన్ త్రోలో బంగారు పతకం.
- అవని లేఖరా కు ఉమెన్స్ 10మీటర్ల రైఫిల్ పోటిల్లో బంగారు పతకం.
- నితీశ్ కుమార్ కు పారా బ్యాడ్మింటన్ లో బంగారు పతకం.
ఇంకా 4 రోజుల పోటీల్లో భారత్ మరికొన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది. అవి గెలిస్తే ఈ సారి పారాలంపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండినట్లే.
మరి మన వారు మరిన్ని పతకాలు సాధించాలని అందరం మనసారా కోరుకుందాం. చిన్న అంగ వైకల్యానికే బాధ పడుతూ ఉండే వారికి ఈ పారాలంపిక్స్ విజేతలు స్పూర్తిగా నిలుస్తారు.