మూవీడెస్క్: చిన్న చిత్రాలకు ఈ మధ్య కాలంలో థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది. ఈ తరహాలోనే రానా దగ్గుబాటి నిర్మించిన “35 చిన్న కథ కాదు” సినిమా సెప్టెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది.
కమర్షియల్ ఎలిమెంట్లు లేకపోయినా, కథ, ఎమోషన్స్ మీద దృష్టి పెట్టి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, భాగ్యరాజా, గౌతమి వంటి మంచి నటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి అంచనాలు సృష్టించుకుంది.
విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు, ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి సపోర్ట్ చేస్తున్నారు.
రానా సమర్పణలో ఈ చిత్రానికి 6.5 కోట్ల పెట్టుబడి పెట్టగా, డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌కు 7.5 కోట్లకు విక్రయించారు.
దీంతో రానా ఈ చిత్రంతో టేబుల్ ప్రాఫిట్ సాధించారు. శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్మే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో, రానాకు ఈ సినిమా పెద్దగా రిస్క్ లేకుండా ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతుందని అనుకుంటున్నారు.
మరి నివేదా థామస్ నటన, కథలోని ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి.