న్యూఢిల్ల్: ఇండియా ఐడియాస్ సమ్మిట్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సమ్మిట్ ను యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మోడీ భారతదేశంలో పెట్టుబడులను ఆహ్వానించే ఉద్దేశంతో యూఎస్ లోని వ్యాపారులతో మాట్లాడారు.
ప్రభుత్వం పెట్టుబడిదారులకు సౌకర్యాలు కల్పిస్తున్న మార్గాలు, మౌలిక సదుపాయాలు, విమానయాన, రక్షణ, అంతరిక్ష పరిశోధనలతో సహా వివిధ రంగాలలో ఆశాజనకంగా వృద్ధి చెందుతున్నాయని తెలిపైన ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా సంస్థలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
భారతదేశాన్ని పెద్ద పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తిస్తూ, “కోవీడ్-19 లాక్డౌన్ సమయంలో, భారతదేశానికి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చింది” అని పేర్కొన్నారు. “ఈ రోజు, భారతదేశం పట్ల ప్రపంచానికి నమ్మకం ఉంది. దీనికి కారణం భారతదేశ పారదర్శకతతో కూడిన అవకాశాలు అందిస్తుంది” అని ఇండియా-ఐడియాస్ లో ఆయన అన్నారు.
ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని కోరుకునే ప్రాంతాల గురించి వివరిస్తూ, “కీలకమైన వ్యాపార రేటింగ్‌లలో భారతదేశం పెరిగిన తీరు పట్ల మీరు ఆశావాదాన్ని చూడవచ్చు, ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిన ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 190 దేశాలలో భారత్ 14 స్థానాలు ఎగబాకి 63 వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం 50 వ స్థానాన్ని లక్ష్యంగా చేసుకుంది.