జూబ్లీ హిల్స్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగుచూసింది.
నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న భూమి పొరల నుండి ఒక్కసారిగా పొగలు రావడం గమనించిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
కాగా, ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. మొదట స్వల్పంగా వచ్చిన పొగలు, తర్వాత మాత్రం నెమ్మదిగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.
అదే సమయంలో, రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు ఇటీవల 11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌ను కూడా అమర్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కారణంగానే పొగలు వచ్చి ఉండొచ్చని కొందరు స్థానికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఈ పొగలు రావడానికి అసలన శాస్త్రీయ కారణం పై ఇంకా ఎటువంటి స్పష్టమైన్ సమాచారం తెలియరాలేదు.