అమరావతి: ఆంధ్రా క్రికెట్ సంఘం లో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) ఏకగ్రీవంగా ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్ష పదవికి పి.వెంకటరమణ ప్రశాంత్, కార్యదర్శి స్థానానికి సానా సతీష్ బాబు ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శిగా బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్‌గా దండమూడి శ్రీనివాస్ ఎన్నికలలో విజయం సాధించారు.
ఈ వివరాలను రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఏసీఏ నిర్వహణపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా, ఆంధ్రా జట్టు స్టార్ ఆటగాడు హనుమ విహారి కెప్టెన్సీ కోల్పోవడం రాష్ట్ర క్రికెట్ లో వివాదానికి దారితీసింది.
ఇప్పుడు, కొత్త పాలకవర్గం బాధ్యతలు తీసుకోవడంతో, హనుమ విహారి మళ్లీ ఆంధ్రా జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.