fbpx
Friday, September 20, 2024
HomeAndhra Pradeshవాయుగుండం ప్రభావం- ఉత్తరాంధ్ర విలవిల

వాయుగుండం ప్రభావం- ఉత్తరాంధ్ర విలవిల

Uttarandhra-due-to the- effect of- windstorm

ఉత్తరాంధ్ర: వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వర్షాల ఉధృతితో విశాఖపట్టణం గజగజలాడుతోంది.

వీధుల్లోకి నీరు చేరడం, కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోపాలపట్నం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి, స్థానికులను పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. గోపాలపట్నం రామకృష్ణనగర్ కాళీమాత గుడి వద్ద కొండచరియలు పడటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయంతో ఉన్నారు.

స్థానిక శాసనసభ్యుడు గణబాబు బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. హనుమంత్వాక, ఎండాడ, తోటగురువు, మధురవాడ ప్రాంతాల్లోనూ ప్రజలు భయంతో ఉన్నారు. మరోవైపు, జీవీఎంసీ సిబ్బంది విజయవాడలో పునరావాస కార్యక్రమాల్లో ఉండటంతో విశాఖలో సహాయ చర్యలకు సిబ్బంది కొరత ఏర్పడింది.

శ్రీకాకుళం జిల్లాలో రాకపోకలు నిలిచిపోయి, ప్రభుత్వం పునరావాస చర్యలు చేపడుతోంది. లావేరు మండలంలో సెట్టిగెడ్డలో వాహనం కొట్టుకుపోవడం, డ్రైవర్‌ను స్థానికులు రక్షించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular