న్యూఢిల్లీ: సెప్తేంబర్ 19 నుండి బంగ్లాదేశ్ తో మొదలయ్యే టెస్టులో విరాట్ కోహ్లీ కోసం వేచి చూస్తున్న రికార్డులు.
బంగ్లాదేశ్ తో తొలి టెస్టు చెన్నై లో ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు ఇటీవలే బీసీసీఐ జట్టు ప్రకటన కూడా చేసింది.
కాగా, ఈ టెస్టుకు రిషభ్ పంత్ సెలక్ట్ అవడం జరిగింది. ఇక లెజెండ్స్ రోహిత్, విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉన్నరు.
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం:
విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్మన్ 29 సెంచరీల రికార్డును అధిగమించడానికి ఒక్క సెంచరీ దూరంలో ఉన్నారు.
బంగ్లాదేశ్ తో తెస్టుల్లో 32 పరుగులు చేస్తే పుజారా పేరిట బంగ్లాదేశ్ పై ఉన్న 468 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తారు.
152 పరుగులు చేస్తే విరాట్ టెస్టుల్లో 9000 పరుగుల మైలు రాయిని అందుకుని లెజెండ్స్ సచిన్, ద్రావిడ్, సునీల్ గవాస్కర్ సరసన నిలుస్తారు.
మరి విరాట్ కోహ్లీ ఫాన్స్ తన అభిమాన ఆటగాడు ఇవి సాధించాలని కోరుకుంటున్నారు.