తెలంగాణ: తెలంగాణా డ్వాక్రా గ్రూపు మహిళలకు ఒక గొప్ప శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తూ వస్తోంది.
తాజాగా, డ్వాక్రా గ్రూపు మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఇప్పటికే ఒక మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేసినట్టు సమాచారం. దీనితో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకం ప్రకారం, పొదుపు సంఘంలో సభ్యురాలైన మహిళకు లేదా ఆమె కుటుంబంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వేరెవరైనా వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వబడుతుంది. ఇది స్త్రీనిధి రుణం ద్వారా కొనుగోలు చేసి పంపిణీ చేయబడుతుంది.
అయితే, మహిళలు ఈ రుణాన్ని నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ ఆటోల కోసం ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ పథకంతో డ్వాక్రా మహిళలు, వారి కుటుంబాలు ఆర్థికంగా మరింత స్వయంసమృద్ధి సాధించేందుకు అవకాశాలు లభిస్తాయని ఆశించవచ్చు.