మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ పై ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఇది తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించే చిత్రంగా నిలుస్తుందని అంటున్నారు.
ఈ చిత్రం విడుదలకు ముందే అనేక రికార్డులు సృష్టిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది. ముఖ్యంగా అమెరికాలో దేవర ప్రీ సేల్స్ తోనే కొత్త రికార్డులను సృష్టించింది.
ట్రైలర్ విడుదల కాకుండానే వన్ మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా, 1.5 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకుంది.
ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా సాధించని ఘనత దేవర సాధించడం విశేషం. ఇక బ్రిటన్ లో కూడా లిమిటెడ్ బుకింగ్స్ లో పదివేల టిక్కెట్లు తక్కువ సమయంలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా, లాస్ ఏంజిల్స్ లోని ఈజిప్షియన్ థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతుండడం, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాకు వచ్చే ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, విడుదల తరువాత ఇంకెన్ని వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.