మూవీడెస్క్: తమ ప్రేమ కథను వివాహ బంధంతో మరింత బలంగా మార్చనున్నట్లు ఇదివరకే హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ క్లారిటీ ఇచ్చారు.
ఇక పెళ్లితో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ పద్దతిలో వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన మూమెంట్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
వధువు అదితి గోల్డెన్ జారీ లెహంగాలో మెరిసిపోగా, సిద్ధార్థ్ సాంప్రదాయ వెష్టిలో అందంగా కనిపించారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ, “నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ నువ్వే” అంటూ అదితి తన ప్రేమను వ్యక్తం చేసింది.
చాలా కాలంగా వీరి ప్రేమ గురించి పలు ఊహాగానాలు వచ్చినప్పటికీ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక గతంలో పెళ్లి రహస్యంగా జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగినట్లు చెప్పారు. ఇంతలోనే, అభిమానులు వీరి వివాహం గురించి ఎక్కువ ఆసక్తి చూపడంతో, చివరికి వీరు పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటించారు.