మూవీడెస్క్: అల్లు అర్జున్ పుష్ప-2 డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో, మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ మూడు సంవత్సరాలుగా బన్నీ తన పూర్తి సమయాన్ని పుష్ప ప్రాజెక్ట్‌కే కేటాయించిన విషయం తెలిసిందే.
మరి ఆ తరువాత ఆయన ఏ దర్శకుడితో పనిచేయబోతున్నారు అన్నది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం, అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రాజెక్ట్ రద్దయిందని, అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారని టాక్ వినిపించింది.
కానీ తాజా సమాచారం ప్రకారం, బన్నీ మరియు అట్లీ కాంబినేషన్ పక్కాగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ-సిరీస్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం.
ఇక, బన్నీ మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో కూడా సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఈ ప్రాజెక్ట్ త్వరగా పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు, ఎందుకంటే సందీప్ ప్రస్తుతం స్పిరిట్ అనే సినిమాపై దృష్టి సారించారని తెలుస్తోంది.
దీంతో నెక్స్ట్ అట్లీతోనే బన్నీ సినిమా ఫిక్స్ అనే అనుమానాలు వస్తున్నాయి. అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ మూవీ, బాలీవుడ్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్ ఇండియా స్థాయిలో అట్లీకి మంచి గుర్తింపును తెచ్చింది.
మరోవైపు, పుష్పతో అల్లు అర్జున్ సౌత్‌లో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు.