హైదరాబాద్: పూరి జగన్నాథ్ దర్శకత్వం గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంలేదు. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న అందరు పెద్ద హీరోలతో గొప్ప సినిమాలు తీసాడు. తీసిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. పూరి తీసిన దాదాపు అన్ని సినిమాలు కమర్షియల్ ధోరణి లోనే ఉంటాయి కానీ అందులో కూడా కొన్ని సినిమాలు చాలా ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. సినిమా బాగాలేకపోయిన కూడా పూరి డైలాగ్స్ కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి ఎలా అంటే అది విని కొద్దిసేపు అయినా అర్రే నిజమే కదా అని ఆలోచిస్తాం. పూరి హీరో తో చెప్పించే మాటల్లో ఒక రకమైన నిజం ఉంటుంది ఉదాహరణకి నేనింతే, బిజినెస్ మాన్ లాంటి సినిమాలు. కొన్ని సార్లు అది ముక్కుసూటిగా చెప్పినట్టే ఉంటుంది కానీ అందులో నిజం లేకపోలేదు.
ఇదిలా ఉండగా ప్రసుతం పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో కొన్ని విషయాల పైన తన ఆలోచనల్ని తన భావాల్ని పోడ్ కాస్ట్ రూపంలో ఆపిల్ పోడ్ కాస్ట్స్ లో అలాగే స్ఫోటిఫై లో ఆడియో రూపం లో పొందుపరచారు. ఆడియో ల రూపం లో తన ఐడియాలజీ ని పంచుకుంటున్నారు పూరి. మనీ, సింప్లిసిటీ, స్ట్రగుల్, బుద్ధ, రైల్వే స్టేషన్ లాంటి పేర్లతో వివిధ అంశాల పైన తన భావాల్ని ఈ ముసింగ్స్ రూపంలో పొందుపరచారు. ప్రస్తుతం ఇవి బాగా పేరు పొందాయి. చాలా మంది వీటిపై పాజిటివ్ గా ఉన్నారు. చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయని, చాలా ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయని ఇంకా ఇలాంటివి చాలా చెయ్యాలని సూచించారు. ప్రస్తుతం పూరి ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకునే వారికీ సూటిగా సుత్తిలేకుండా చెప్పాలంటే ఇలా చెప్పవచ్చు అనే కొత్త దారి చూపించే మార్గం లో ఉన్నారు.