న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తరువాత ఆప్ మంత్రి అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ నిర్ణయం ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో తీసుకున్నారు. ఆప్ నేత దిలీప్ పాండే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను కేజ్రీవాల్ కే వదిలే ప్రతిపాదన చేసారు.
కేజ్రీవాల్, అతిషి పేరును ప్రతిపాదించగా, ఆప్ ఎమ్మెల్యేలు అందరూ అంగీకరించారు. ప్రస్తుతం విద్యా, ప్రజా నిర్మాణ శాఖలను చూసే అతిషి, ఢిల్లీ పాఠశాల విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2020లో సిసోడియా అరెస్టైన తరువాత మంత్రి పదవిని స్వీకరించారు. ఆగస్టు 15న, అతిషికి జాతీయ జెండా ఎగరేయడానికి కేజ్రీవాల్ అవకాశం ఇచ్చారు.
కానీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అడ్డుకున్నారు. అతిషిపై ఆప్ నాయకత్వానికి విశ్వాసం ఉన్నట్లు స్పష్టం అయింది.
రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ తన రాజీనామా ప్రకటించారు. ఎన్నికలు నవంబర్లో జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు, మళ్లీ ప్రజల తీర్పుతోనే అధికారం తీసుకుంటామని తెలిపారు.